రాయల్ పోస్ట్ ప్రతినిధి గుండాల : జనవరి22:మండల పరిధిలోని అన్ని గ్రామాలకు పీపీఆర్ వ్యాధి నివారణకు జనవరి 24 నుండి ఫిబ్రవరి 7 వరకు టీకా మందు జీవాలకు ఇవ్వనున్నామని మండల పశువైద్య శాఖ అధికారి యాకూబ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.గొర్రెలు, మేకలకు పుర్రు (పారుడు) రోగ నిరోధక టీకాలు ముందు జాగ్రత్తగా వేయించుకోవడం వల్ల జీవాల మరణాల రేటును తగ్గించుకోవచ్చని గొర్రెల మేకల పెంపకదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర వంగూరి గోవిందు,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.