రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన కోమటిరెడ్డి. కామినేని MD తో ఫోన్ లో మాట్లాడిన కోమటిరెడ్డి చికిత్స పొందుతున్న తల్లి కొడుకు లకు వైద్య ఖర్చులు ఇస్తానని హామీ.

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /చౌటుప్పల్ లో రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబాన్ని ఆదుకుని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చిన ఎంపీ కోమటిరెడ్డి .చౌటుప్పల్ విజయవాడ హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తడ్రి చిన్న కుమారుడు మరణించగా తల్లి పెద్ద కుమారున్ని హాస్పిటల్ కి తరలించారు విషయం తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సహాయంగా లక్ష యాభై వెయ్యిల రూపాయలు ఇచ్చారు మరియు కామినేని MD తో ఫోన్ లో మాట్లాడిన కోమటిరెడ్డి గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి కొడుకుల వైద్య ఖర్చు తనే ఇస్తాను అని తెలిపారు.ఈ రహదారి ఇరుకుగా ఉండటం కారణంగానే నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎనిమిది లైన రోడ్డు విస్తరణ చేయాలని కేంద్ర మంత్రిని కూడా కలిశానని ఎంపీ కోమటిరెడ్డి గారు గుర్తుచేశారు..ఈ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వకపోవడం కారణం గా ఇలాంటి ప్రమాదాలకు గురియైన నిరుపేద ప్రజలు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రహదారి పై ప్రమాదాలకు పరోక్షంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి…