రాయల్ పోస్ట్ ప్రతినిధి

దేశానికి వెన్నుముక రైతు అలాంటి రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి దేశానికి మంచిదికాదు ఉన్నత విద్య చదివి ఉద్యోగం రాక వ్యవసాయం చేద్దామనుకుంటే భూమిని పక్కోడిపాలు చేయడానికి అధికారులు కంకణం కట్టుకుంటే కడుపుమండిన రైతు ఏమిచెయ్యాలి?.నిస్సహాయ స్థితిలో తన భూమిని కాపాడుకోవడానికి గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటానికి కంకణం కట్టుకున్నారు.అధికారుల అవినీతికి వ్యతిరేకంగా మౌన రిలే నిరహార దీక్ష చేపట్టాడు వివరాల్లోకి వెళితే

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన తౌటం రాజేంద్రప్రసాద్ అనే యువకుడు ఉన్నత విద్య చదివిన ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెంది తనకున్న 612 /అ/ 5 లోని 3ఎకరాల 16 గుంటల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు.కానీ రికార్డ్ పరంగా పార్ట్ బీ లో ఉన్నందున తన భూమిని తన పేరుమీద పట్టా పాసు పుస్తకం ఇవ్వాలని 4 సంవత్సరాల నుండి రెవెన్యూ అధికారులకు వినతులు ఇచ్చిన కాలయాపన చేస్తూ రికార్డును నా ప్రమేయం లేకుండానే ఇష్టానుసారంగా మార్చివేసిన దాన్ని సరి చేయమంటే కాలయాపన చేస్తూ నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.అయితే దీనివల్ల వాస్తవాలను దాచి భూ కబ్జాదారులకు,అవినీతి అధికారులకు అండగా ఉండేందుకు తనను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బందుల పాలు చేస్తూ అధికారులు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగి చివరికి ఆత్మహత్య బారిన పడేలా చేస్తున్నారని ఆవేదనతో బెల్లంపల్లి ఆర్.డీ.ఓ కార్యాలయం వద్ద మౌన దీక్ష చేపట్టినట్లు తెలిపాడు. గత సంవత్సరం 48గంటల నిరాహార దీక్షకు సందర్భంలో పాలకవర్గం సిబ్బంది ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఎన్నికైనా ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడా పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికారులు జిల్లా పాలనాధికారి స్పందించి తనకు న్యాయం జరిగే విదంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా పాలన ఉండాలని మౌన దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు.