రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /కరోనా థర్డ్ వేవ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. యాదాద్రి పోలీస్ స్టేషన్ లో ఏసిపి, సి ఐ, మా స్టేషన్ సిబ్బంది నేటితో మొత్తం 28 మంది కోవిడ్ బారిన పడటం జరిగింది. యాదగిరిగుట్ట పట్టణ, మండల ప్రజలకు సేవలు అందించడంతో పాటు , లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనంకు వచ్చే భక్తులకు కూడా సేవలు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంది. అయితే మా స్టేషన్ సిబ్బంది ప్రజలకు సేవలు అందించే తరుణంలో కొవిడ్ బారిన పడడం బాధాకరం. ప్రజలు ఏదైనా అత్యవసరమైతేనే పోలీస్ స్టేషన్ కు రాగలరు. అది కూడా ఒక్కరు వచ్చి తమ సమస్యను పోలీసు వారికి విన్నవించుకోండి.. లేనిపక్షంలో 100కు ఫోన్ చేసినట్లయితే స్వయంగా మా సిబ్బంది మీ వద్దకు వచ్చి మరి పోలీస్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు, ప్రజాప్రతి నిధులు పోలీసు వారికి సహకరిస్తూ, తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అత్యవసరమైతేనే పోలీస్ స్టేషన్ కు రావాలని కోరుకుంటున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించగలరని యాదగిరిగుట్ట పోలీసు వారి తరఫున మనవి చేస్తున్నాము.