రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: స్థానిక రైతు ప్రజా సమస్యలపై కార్యాలయానికి వచ్చి తహసిల్దార్ గారికి విన్నవించడానికి వచ్చిన ప్రజా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించి, అవమానపరిచిన తుర్కపల్లి తహసీల్దార్ రవి కుమార్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారికి ఈరోజు తుర్కపల్లి మండల ప్రజాప్రతినిధుల 20 మంది బృందం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా తుర్కపల్లి ఎంపీపీ శ్రీమతి భూక్య సుశీల రవీందర్ నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి సర్పంచ్ పోగుల ఆంజనేయులు మాట్లాడుతూ స్థానిక ప్రజా సమస్యలపై ముఖ్యంగా రైతు సమస్యలపై వివరించడానికి, చర్చించడానికి తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజా ప్రతినిధులను, ఎంపీటీసీ ,సర్పంచ్ లను ముఖ్యంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ స్థానిక జెడ్ పి టి సి ధనావత్ బీకూ నాయక్ గారిని బయటికి వెళ్లవలసిందిగా ఆదేశించడం, అసభ్య పదజాలంతో దూషించడం, అవమానపరచడం, సిగ్గుచేటని తహసిల్దారు గారు ఒక ప్రజాసేవకులుగా కాకుండా ఒక నియంతగా అహంకారిగా వ్యవహరిస్తూ ఇష్టారీతిన తహసిల్దార్ కార్యాలయాన్ని రియల్ ఎస్టేట్ కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని తహసిల్దార్ రవికుమార్ ను విధుల నుండి తొలగించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మండల సర్పంచ్ లు నామసాని సత్యనారాయణ,శారద శంకర్, మంగ్తా నాయక్, జ్యోతి భాస్కర్, బాలకృష్ణ యాదవ్,రమేష్ నాయక్,సురేష్, ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షులు పాచ్యానాయక్, ఎల్ ఎచ్ పి ఎస్ నాయకులు సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.