రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / కొండపైన నెలకొన్న సమస్యలను పరిష్కరించి భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని దేవాలయం కార్యనిర్వహణాధికారి గీతారెడ్డికి సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడుకున్న వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ కొండపైన త్రాగునీరు నీటి వసతి మరుగుదొడ్ల సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వాటిని తక్షణమే ఏర్పాటు చేయించాలని అదేవిధంగా 31 మంది టాంగా కార్మికుల పైన పెట్టినటువంటి కేసును విరమించుకుంటామని గతంలో హామీ ఇచ్చారని కానీ ఇప్పటివరకు ఆ కేసును విరమించుకోలేదని తక్షణమే కేసును విరమించుకోవాలని కోరారు. 300 మందికి పైగా ఆటో కార్మికులు కొండ పైకి ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నారని యధావిధిగా ఆటోలు నడపడానికి మరియు కొండపైన ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. దేవాలయంలో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని అని నూతనంగా ఏర్పాటు చేసే షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా స్థానిక నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పించి ఉపాధి అందించాలని కోరారు. వసతి సదుపాయాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే కొండకింద బస్టాండ్ ఎదురుగా ఉన్న యోగానంద నిలయం మరమ్మతులు చేయించి వసతి గృహాలను ప్రారంభించాలని కోరారు. పాత గుట్ట దేవాలయానికి వెళ్లే రోడ్డు గుంతలు ఏర్పడి రవాణాకు ఇబ్బందిగా ఉందని తక్షణమే మరమ్మతులు చేయించాలని కోరారు. కొండపైన ప్రసాదాల విక్రయ శాల సరిపడా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని మరియు ప్రసాదాల ధరలు పెంచడం వల్ల భక్తులకు ఇబ్బందులు అవుతున్నాయని పెంచిన ప్రసాదాల ధరలు తగ్గించాలని కోరారు. దేవాలయం తరఫున 50 పడకల ఆసుపత్రిని నిర్మాణం చేసి ఉచితంగా వైద్య సౌకర్యం మందులను అందజేయాలని కోరారు. దేవాలయం ఉద్యోగులు డ్రెస్ కోడ్ పద్ధతిని అమలుచేసి ఐడి కార్డ్ వేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తుల కోసం విచారణ కార్యాలయంలో పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని కోరారు. దేవాలయం రోజువారి కూలీలుగా పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతభత్యాలు పెంచి వాళ్ళను దేవాలయం ఉద్యోగస్తులుగా గుర్తించాలని కోరారు పైన తెలిపిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని వినతి పత్రం ద్వారా కోరడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి దేవాదాయ కమిషనర్ కి తీసుకు వెళ్ళి సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, సిపిఐ మండల కార్యదర్శి బబ్బురి శ్రీధర్, ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి జిల్లా జానకి రాములు, సిపిఐ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు పేర బోయిన పెంటయ్య, నాయకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.