రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి ని
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాల చర్యలు పేర పించే గా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నగేష్ ఆరోపించారు.
భువనగిరి పట్టణంలో స్థానిక ఆర్ బి నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నగేష్ పిసిసి మాజీ కార్యదర్శి తంగళ్ళపల్లి రవికుమార్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటూ రైతులను వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి కార్పోరేట్ సంస్థల లబ్ధి కోసమే పని చేస్తుందని అన్నారు. భారతీయ రైతులు
మట్టిని నమ్ముకుని దేశానికి కడుపు నింపే సైంటిస్టుల అన్నారు. ప్రభుత్వాలు రైతులకు ఇన్పుట్ సర్వీసు విద్యుత్ సబ్సిడీలు మార్కెటింగ్ వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం వ్యవసాయ రంగం నిర్వీర్యం చేసే కుట్ర దాగి ఉందని అన్నారు. జరగబోయే అయిదు రాష్ట్రాల్లో రైతులు బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో జోనల్ వ్యవస్థ ఉద్యోగుల ఆత్మహత్యలకు కారణమైందని ఆరోపించారు. ఏలాంటి నిపుణుల సూచనలు ప్రతిపక్షాల సలహాలను లేకుండానే జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు మనోవేదనకు గురి చేసిందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెడుతున్న ఇంగ్లీష్ మీడియం స్వాగతి ఇస్తున్నామన్నారు సాంకేతికపరంగా ఉపాధ్యాయులను నియమించకుండా బోధన ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ఆర్ ఆర్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వ గెజిట్ లేకుండానే రెవెన్యూ అధికారులు రోడ్డు హద్దులు వేయడంతో చిన్న సన్నకారు ఆవేదనకు రైతులుగురవుతున్నారని వెంటనే ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం వేస్తున్నా అవుటర్ రింగ్ రోడ్డు జిల్లా కేంద్రం నుండి వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే రైతులను కోల్పోతున్న భూములలో రైతులను అవగాహన కల్పించి గెజిట్ ప్రకారమే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సలావుద్దీన్ ముత్తు ఎస్ ఎస్ సాయి వినోద్ రాము రమేష్ నవీన్ ప్రవీణ్ నరేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.