రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ మహమ్మద్ అతహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతహర్ విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా డ్రామాలు ఆడుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎన్నో వేల ఉద్యగ నోటిఫికేషన్లు వేసి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తుచేశారు ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రయివేటు రంగంలో కూడా అనేక మందికి ఉపాధి కలిపించారని అన్నారు కానీ కేసీఆర్ రెండు దఫాలుగా ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నప్పటికి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకుడైతున్నాడని దుయ్యబట్టారు.నిరుద్యోగుల ఓట్ల కోసం గత పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల సంధర్భంగా ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇంత వరకు అమలుకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివి నిరాశలో ఉంటే ఒక టీఆరెస్ మంత్రి డిగ్రీ చదివిన వాళ్ళను హామాలి పని చేసుకోవాలని నిరుద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడారని ఇలాంటి మంత్రులు మన రాష్ట్రంలో ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటు అని అన్నారు.వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్షలు చేసి నిరుద్యోగుల పక్షాన నిలిచారన్నారు . ఇప్పటికైనా కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో నుండి బయటికి వచ్చి ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి 3016 నిరుద్యోగ భృతి పథకం అమలు చేసి నిరుద్యోగులకు ధైర్యం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.లేని యెడల రాబోయే రోజులలో వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.