క్రైమ్.నెం. 24/2022 U/s 381IPC

నేరం జరిగిన స్థలం : భువనగిరి మండలం రాయిగిరి గ్రామం వద్ద సోమరాధాకృష్ణ ఫంక్షన్ హాల్ సమీపంలో

నేరస్థుడు : కొంగరి రఘుపతి s/o. అంజయ్య, వయస్సు: 33 సం., కులం: , వృత్తి: కార్ డ్రైవరు, R/o. వద్దిచెర్ల, స్టేషన్ ఘన్ పూర్ మండలం, జనగాం జిల్లా.

నేరస్థుడు గత కొంత కాలంగా కార్ డ్రైవరుగా అద్దెకు పనిచేస్తున్నాడు. పదోవ తరగతి వరకు నాచారంలో చదువుకున్నాడు. అతని తండ్రి వాచ్ మెన్ గా పనిచేసేవాడు, తర్వాత ఆర్ధిక పరిస్థితి బాగలేక జనగాంలో స్థిరపడటం జరిగింది. నేరస్థుడు చెడు వ్యసనాలకు లోనై మందు త్రాగడం అలవాటు చేసుకొని, అప్పులకు గురై ఏ విధంగా అయిన సులభంగా ధనం సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనం చేయాలి అనే ఆలోచన వచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తుండగా తేదీ 16-01-2022న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జనగామకి చెందిన రిటైర్డ్ తెలుగు పండిత్ శ్రీ వెంకటచార్యులు గారు అతని ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్ లోని ఈసి్‌ఐ‌ఎల్ వద్ద ఉండే అతని కుమారుడు శేషు కుమార్ దగ్గరకి వెళ్ళి హాస్పిటల్ లో చూపించుకోవడానికి వెళ్ళాలి, కూలీ 1000 రూ. ఇస్తామని చెప్పగా అందుకు నేరస్థుడు ఒప్పుకున్నాను. నేరస్థుడు గత సంవత్సరంనున్నర నుండి వారు అపుడపుడు పిలిచినపుడు కూడా వెళ్ళేవాడు. తేదీ 16-01-2022న సాయంత్రం అందాజ 5 గంటల 15 నిమిషాల ప్రాంతంలో వెంకటచార్యులు గారి సొంత కారులో నేరస్థుడు, వెంకటచార్యులు గారు మరియు వారి సతీమణి ముగ్గురు కలిసి హైదరాబాద్ లోని వారి కుమారుడు ఇంటికి జనగాం నుండి బయలుదేరారు. మార్గమద్యలో భువనగిరి మండలం రాయిగిరి గ్రామం వద్ద సోమరాధాకృష్ణ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉండే వెంకటచార్యులు గారి తమ్ముడి ఇంటి దగ్గర 25 నిమిషాలు ఆగారు. వారు ఇంటిలోపలికి వెళ్ళి టీ తాగి మాట్లాడి వచ్చేలోపు సమయం పడుతుంది అని ఇదే దొంగతనానికి అనుదైన సమయం అని నేరస్థుడు భావించి వారు లాగేజ్ బ్యాగ్ లో పెట్టిన చిన్న ఎర్రటి బట్ట సంచి తీసి చూడగా అందులో చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నది, నేరస్థుడు బయపడి అట్టి డబ్బుల సంచిని తీసి అక్కడే ఉన్న చెట్లలో డబ్బు దాచాడు. వారు బయటకు రాగానే కార్ స్టార్ట్ చేసి హైదరాబాద్ లోని వారి కుమారుడి ఇంటి దగ్గరికి రాత్రి సుమారు 07 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చేరుకున్నారు. వారిని హైదరాబాద్ లోని దించి నేరస్థుడు బస్ ఎక్కి తిరిగి రాయిగిరి గ్రామానికి రాత్రి సుమారు 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చేరుకొని అక్కడి నుండి నడుచుకుంటూ డబ్బుల సంచి పడేసిన ప్రదేశానికి వెళ్ళి చెట్ల పొదల్లో ఉన్న బట్టసంచిని తెరిచి చూడగా అందులో 500రూపాయల నోట్లు 250, 200రూపాయాల నోట్లు 500 కలవు, మొత్తం 2,25,000 రూపాయలు. అట్టి డబ్బులు తీసుకొని జనగాంలోని తన ఇంటికి నేరస్థుడు వెళ్ళాడు. తిరిగి తెల్లారి తేదీ 17-01-2022న సుమారు 11 గంటల ప్రాంతంలో వెంకటచార్యులు గారి కుమారుడు ఫోన్ చేసి డబ్బులు గురించి అడుగగా ఇంకొక కిరాయి పని మీద హైదరాబాద్ కి వచ్చానని అట్టి డబ్బులు గురించి నాకు ఏమి తెలియదని చెప్పాడు. తర్వాత మొత్తం డబ్బులో నుంచి 6,500 రూపాయలు ఇంటి సరుకులకు, 8 వేల రూపాయలను సొంత ఖర్చులకు నేరస్థుడు వాడుకున్నాడు. మిగతా డబ్బులను ఒక ప్లాస్టిక్ కవర్ లో ఎవరికి తెలియకుండా జనగామ ఇంటి దగ్గర దాచిపెట్టాడు. 19.01.2022న ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తెలిసిన వారి ద్వారా ఒక కిరాయి ఉందని చెప్పగా ఆలేరు బస్ స్టాండ్ వద్ద ఓనర్ కోసం ఎదురు చూస్తుండగా మఫ్టీలో ఇద్దరు భువనగిరి రూరల్ పోలీసులు అక్కడికి వెళ్ళగా పోలీసులని బయపడి పారిపోతున్న నేరస్థుడున్ని పట్టుకొని భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావటం జరిగింది. డబ్బు దొంగతనం గురించి నేరస్థుడు ఒప్పుకున్నాడు. జనగామలో నేరస్థుడు ఇంటి దగ్గర దాచిన డబ్బును మరియు డబ్బు సంచిని చూపించాడు. అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.

పై అరెస్ట్ శ్రీ S. వెంకట్ రెడ్డి ACP భువనగిరి డివిజన్ గారి పర్యవేక్షణ లో వి.జానయ్య,సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భువనగిరి రూరల్ మరియు భువనగిరి రూరల్ యస్ ఐ లు కె సైదులు, యస్ వి సుబ్బారెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. (K.నారాయణ రెడ్డి) డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ యాదాద్రి భువనగిరి జోన్