రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: మహిళల పక్షపాతి అంబేడ్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలి….యశోధర. మహిళలకు ఓటు హక్కు ఆస్తి హక్కుతో పాటు వారి హక్కుల కొరకు కృషి చేసిన అంబేడ్కర్ పోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలంగాణా రాష్ట్ర పునః నిర్మాణసమితి వ్యవస్థాపక సభ్యురాలు మాటూరి యశోధర అశోక్ లు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం కు జ్ఞానమాల (57వ వారం) సమర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. భారత రాజ్యంగ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ స్పూర్తి ప్రదాత అంబేడ్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించే వరకు మహిళలంతా కలిసి కట్టుగా కృషి చేయాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అంబేడ్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. గణ తంత్ర దినోత్సవం రోజున తప్పని సరిగా రాజ్యంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఫోటో ను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ జ్ఞానమాల కార్యక్రమం లో కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, సాధన సమితి జిల్లా నాయకులు కొత్త బాలరాజు, బండారు శివ శంకర్, రావుల రాజు, దర్గాయి దేవేందర్,గుడ్డెంకి లక్ష్మి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.