రాయల్ పోస్ట్ ప్రతినిధి

బీజేపీ తాండూర్ మండల కమిటీ పిలుపు మేరకు తాండూర్ మండలం
రేచిని గ్రామ పంచాయతీలోని డంపింగ్ యార్డ్ ను స్థానిక బీజేపీ నాయకులు సందర్శించారు.
ఈ సందర్భంగా బీజేపీ రేచిని శక్తి కేంద్రం ఇంచార్జి తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ
గ్రామంలో సుమారు రూ. 25000 ఉపాధి హామీ నిధులతో నిర్మించిన డంపింగ్ యార్డ్ ను కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రారంభానికి ముందే గోడలు, ఫ్లోర్ పగుళ్ళు తేలాయన్నారు.డంపింగ్ యార్డ్ ప్రారంభం రోజు పగుళ్లను పూల దండలతో కవర్ చేసి స్థానిక ఎమ్మెల్యేతో రిబ్బన్ కటింగ్ చేయించారన్నారు. పంచాయతీ కార్మికులు గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించకుండా డంపింగ్ యార్డ్ కు కూతవేటు దూరంలో రోడ్డుకు ప్రక్కన పడేస్తున్నారన్నారు. అలాంటప్పుడు డంపింగ్ యార్డ్ నిర్మాణం, కేవలం కాంట్రాక్టర్ జేబులు నింపడానికేనా అని పాలక వర్గాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలక వర్గం కమీషన్లకు కక్కుర్తి పడి, అభివృద్ధి పనుల పేరుతో ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెడుతుందన్నారు.ఇప్పటికైనా సర్పంచ్ ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలని లేనిపక్షంలో సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఆనంద్, శ్రీనివాస్, సోమయ్య, సంతోష్ కిరణ్, రాజశేఖర్, కిరణ్, శంకర్, వాగయ్య తదితరులు పాల్గొన్నారు.