రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 16/ సూర్యపేట జిల్లా తాళ్ల కంపాడు గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితం వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎంతో ఆప్యాయతతో ఏర్పాటు చేసుకున్న వైయస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని కొందరు దుండగులు కాల్చి వేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులకు శిక్ష వేయాలని వెంటనే ప్రభుత్వం,పోలీసు యంత్రాంగం చొరవ తీసుకొని వారికి శిక్ష పడేలా చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ మహమ్మద్ అతహర్ అన్నారు.అతహర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో YSR అభిమానులు ఎంతో మంది ఉన్నారని భౌతికంగా మన మధ్యలో లేకున్నా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా కొలువై ఉన్నారని ఇలాంటి మహానేత విగ్రహం పట్ల కొందరు దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పడినా, మత్తు మాదక ద్రవ్యాలకు బానిసలై ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయం ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రమంతటా ఎక్కడ జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా విస్మరిస్తుంది అంతేకాకుండా రోజురోజుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వస్తున్నా ఆదరాభిమానాల పై అసూయ ద్వేషాలతో ఇలాంటి దుర్ఘటనకు పాల్పడుతున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంకొక పర్యాయము ఇలాంటి సంఘటనలు జరిగినచో పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.తక్షణమే ఈ ఘటనకు పాల్పడిన దుండగులను శిక్షించాలని తక్షణమే ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.