రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: విద్య, వైద్యం, ఉపాధి కోసం పోరాటం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల పెల్లి బాలక్రిష్ణ అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవిచెరువు గ్రామంలో ఆదివారం డివైఎఫ్ఐ సభ్యత్వం నమోదు చేయడం జరిగింది.
ఈసందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల పెల్లి బాలక్రిష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే నిధులు నీళ్లు నియామకాలు అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా మన రాష్ట్రంలో లక్షా డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు పూర్తి చేయలేదు.
ఎన్నికల రాగానే నోటిఫికేషన్ పేరుతో నిరుద్యోగులను మళ్లీ మళ్లీ మోసం చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
యువజన హక్కుల సాధన కోసం యువత ముందుండి పోరాడాలని అన్నారు.
అందరికీ ఉపాధి ఉద్యోగ సాధన కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాడాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగినికి ,నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.
నిరుద్యోగ భృతి విధి విధానాలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు గుండు సుధాకర్, గ్రామ అధ్యక్షులు గుండు నర్సింహ, సుర్వి శేఖర్, గుండు జంగయ్య, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు…