“గుండెలోన నువ్వే….” అంటూ హృదయాలను కదిలించే “వర్మ” వీడు తేడా చిత్రంలోని పాట సంక్రాంతి సందర్భంగా శనివారం ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే విశేషమైన స్పందన లభించింది.
నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రమిది. ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్, సుపూర్ణ మలాకర్, సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి,, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన ఈ చిత్రాన్ని జనవరి 21న భారీగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నట్టి కరుణ తెలిపారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా మంగళవారం చిత్రం ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు.
దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, ఎంతో హాయిగా సాగిపోతూ, జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్న ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి? దాంతో అతను ఎలా మారాడు? ఆ తర్వాత సాగే మలుపులతో
సస్పెన్స్ థ్రిల్లర్ గా చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తుంది. క్రాంతి తన పాత్రలో జీవించాడు. పాటలు కూడా ఆకట్టుకుంటూ చిత్రకథలో అంతర్భాగమవుతాయి” అని అన్నారు.
హీరో నట్టి క్రాంతి మాట్లాడుతూ, ఎదో చిత్రం ద్వారా పరిచయం కావడం అనేది కాకుండా యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని తీసిన ఇలాంటి కథా బలం కలిగిన చిత్రంలో నటించడం ఆనందదాయకమని అన్నారు. తన పాత్రలో అన్నిరకాల భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో చమక్ చంద్ర, కేదార్ శంకర్ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, సినిమాటోగ్రఫీ: జనార్దన్ నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: కె.వి.రమణ, ఫైట్స్: వింగ్ చున్ అంజి, నిర్మాత: నట్టి కరుణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.