రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ఉప సర్పంచ్ నీల పోశెట్టి సారథ్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపిపి నరాల నిర్మల వెంకటస్వామి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హెమేంధర్ గౌడ్,తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ (143 ) రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ చేతులమీదుగా ముగ్గుల పోటీలో పాల్గొన్న బబ్బురి భార్గవికి మొదటి బహుమతి 15 వేల విలువ గల పట్టుచీర , రెండవ బహుమతి కళ్లెం ప్రవళిక,10 వెల విలువగల పట్టుచీర మూడవ బహుమతి తాడెం సునిత 5 వేల విలువగల పట్టుచీర, నాలుగవ బాహుమతి బబ్బురి రాణి, ఐదవ బాహుమతి కోట శారదకు ముఖ్య అతిది చేతులమీదుగా అందచేయండం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు ఉత్సవ కమిటీ కనుమ పండుగ శుభాకాంక్షలు తేలియజేశారు. ఆడపడుచులకు దుస్తులు అందజేశారు.మహిళలు ఇక ముందు ముందు కూడా ఇలాగే అన్ని రంగాల్లో రాణించాలని వారు కోరారు. ఈ పోటిలో అందరు విజేతలే అని కొనియాడారు. ఈసందర్భంగా వడాయిగూడెం దుర్గామాత ఉత్సవ కమిటీ చైర్మన్ బబ్బురి పోశెట్టి గౌడ్ , ప్రధాన కార్యదర్శి ముద్దసాని ఉపేందర్ గౌడ్ , కోశాధికారి బబ్బురి శ్రీరాములు మరియు సభ్యులు. టీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి జక్కుల చంద్రయ్య , నోముల నరసింహ , ఎస్సీ సెల్ నాయకులు కోట చంద్రశేఖర్, టిఆర్ఎస్ యూత్ విభజన నాయకులు బబ్బురి సురేష్ , కోల బన్నీ మొగిలిపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు.