రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి :నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ ఆధ్వర్యంలోక్రిస్టియన్ మైనారిటీ లకు మానవ హక్కుల పౌర సంబంధాల అధికారిని
ఇశ్రత్ జహాన్ ఆధ్వర్యంలో
ఐ ఏ ఎస్ తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మిసెస్ వెస్లీ కాంతి వారి సౌజన్యంతో స్థానిక పహాడినగర్ లోని హెబ్రోన్ చర్చి లో నూతన బట్టలను పంపిణి చేయడం జరిగింది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్ మైనారిటీ సోదర సోదరిమనులకు నిరుపేద కుటుంబాలకు 25కుటుంబాలకు నూతన బట్టలను పంపిణి చేయడం సంతోషకరమైన విషయం అని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఇక ముందు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేపడుతామణి అన్నారు అలాగే వక్ఫ్ బోర్డు మెంబర్ ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ భువనగిరి ప్రజలందరి పైన ఏసు ప్రభువు దీవెనలు ఉండాలని ఈ నూతన సంవత్సరం లో అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కరోనా మహమ్మారి నుండి ప్రజలందరికి విముక్తి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో వక్ఫ్ ప్రొటెక్షన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఇస్తియాక్,తెలంగాణ స్టేట్ తెరాస పార్టీ సీనియర్ లీడర్ ఉర్దూ అన్సారీ,
పగిల్ల మాధవి,హుస్సేన్,
చర్చి ఫాదర్ తదితరులు పాల్గొన్నారు