రాయల్ పోస్ట్ ప్రతినిధి

సంక్రాంతి పండగ సందర్భంగా హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న 26 మంది ఆశ కార్యకర్తలకు ధర్మ మీటర్, పల్స్ అక్స్ మిటర్ ,వంద హ్యాండ్ గ్లౌజ్, ఫేస్ షీల్డ్, ఎన్ 95 మాస్క్ లు కలిగిన కిట్ లను అందజేయడం జరిగింది. ఒక్కో కిట్ విలువ సుమారు 5000 రూపాయల వరకు ఉంటుంది. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చిలుక విశ్వ,అల్గామ్ బాలకృష్ణ, మణిదీప్ చరణ్ ఆఫ్జల్ పాషా పాల్గొన్నారు.