రాయల్ పోస్ట్ ప్రతినిధి
బెల్లంపల్లి

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున బెల్లంపల్లి వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో 85 మంది సోదరీమణులచే పూలు పళ్ళు, పసుపుకొమ్ముల నోము నోముకోవడం జరిగినది.పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో పసుపు కుంకుమలతో ముత్తయిదువులుగా ఉండాలని కలకాలం అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని ఆ పార్వతీ అమ్మవారిని వేడుకుంటు ఈ వ్రతాన్ని నిర్వహించడం జరిగిందని మహిళలు తెలిపారు. ఈ నోమును 250 కిలోలు పసుపు కొమ్ములు,28 కిలోలు పూలు, 50కిలోల పళ్ళు, 20 కిలోలు కుంకుమ, 15 కిలోలు పసుపుతో పార్వతి అమ్మవారిని మహిళలు ఘనంగా కొలిచారు.