రాయల్ పోస్ట్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా: శంకర్పల్లి మున్సిపల్ మేరా సందర్భంగా శనివారం నాడు శంకర్పల్లి సేవా ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఆర్మీ ex సర్వీసు మెన్ అండ్ ఆఫీసర్ కులదీప్ సింగ్ మరియు యాదయ్య లను ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ పూల మాల శాలువా తో సత్కరించి మెమెంటో లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ అందరూ జీతం కోసం పని చేస్తే మిలిటరీ జవాన్ లు దేశ కోసం పని చేస్తూ ప్రాణాలు అర్పిస్తారు అని పేర్కొన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని పుట్టిన ఊరుకు పేరు తీసుక రావాలన్నారు. మిలిటరీ త్యాగాలను ధైర్య సాహసాలను క్రమశిక్షణ ను అలవర్చుకుంటే నేటి యువత లో చెడు ఆలోచనలు రానేరావు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లిటిల్ స్టార్ కరస్పాండెంట్ సంజీత్ కుమార్ సబ్యలు నర్శింహ గౌడ్, ఇందూరు రాజు,నాగేంద్ర ,ఒడిఫ్ ఎంప్లొయ్ అంజయ్య గౌడ్, వెనేంద్ర చారి,కేదారి చారి,హరి,చిరంజీవి, నితిన్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు