అమ్మనాబోలు గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన బీర్ల…..

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం అమ్మానాబోలు గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో వాటార్ ప్లాంట్ ప్రారంభించిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య..అనంతరం గ్రామంలో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని,మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు.అమ్మానాబోలు గ్రామంలో మహిళలు చక్కటి ముగ్గులు వేయడం చాలా సంతోషంగా వుందని అన్నారు.బీర్ల ఫౌండేషన్ ఆలేరు నియోజకవర్గంలో అన్ని రకాల సేవలు అందిస్తుందని ఎవ్వరికీ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటామని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య తెలిపారు.