రాయల్ పోస్ట్ ప్రతినిధి :: భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో కోవిడ్ వార్డ్ ను వెంటనే ప్రారంభించాలి మహమ్మద్ అతహర్ కో కన్వీనర్ భువనగిరి పార్లమెంట్, వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ… భువనగిరి ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వార్డ్ వెంటనే ప్రారంభించి వైద్య సేవలు అందిచాలని అతహర్ జిల్లా హెల్త్ ఆఫీసర్ సాంబశివరావు గారితో ఫోన్ సంభాషణ ద్వారా కోరడం జరిగింది . బుధవారం అతహర్ విలేకరులతో మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వైద్య సేవలు ఇప్పటి వరకు ప్రారంభించలేదని 20 బెడ్ల తో మొదలుపెట్టవల్సిన కోవిడ్ వార్డ్ , ఏరియా ఆసుపత్రికి కి మంజూరు అయిన ఆక్సిజన్ ప్లాంట్ ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. కోవిడ్ వార్డ్ లో ఒకే ఒక వెంటిలేటర్ ఉందని 10 బెడ్ లకు సరిపోయే వెంటిలేటర్ ను కూడా త్వరగా ఇంస్టాల్ చెయ్యాలని దాని ద్వారా కోవిడ్ రోగులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కోవిడ్ వార్డ్ కు సరిపడా డాక్టర్ల ను, నర్సులను, ప్రత్యేకంగా ఒక కౌన్సీలింగ్ టీం ను ఏర్పాటు చేయాలని కోరారు.కోవిడ్ రోగుల కొరకు ప్రత్యేక అంబులెన్స్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ టెస్ట్ లను పెంచి, కోవిడ్ వైద్య సదుపాయాలు మందులు,ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లు, పిపిఈ కిట్లు, పల్స్ ఆక్సీ మీటర్లు మొదలగు వాటిని పెద్ద సంఖ్యలో నిల్వ ఉంచుకోవాలను జిల్లా వైద్య అధికారిని కోరడం జరిగింది..