రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /(భువనగిరి టౌన్) స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కె.అమరేందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, జిల్లా యువజన అధికారి ధనంజనేయులు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి. శ్యాంసుందర్, తదితరులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశాన్ని జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని, యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసములు, వాదనల ద్వారా అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు పరిచయం చేసిన ఖ్యాతి వారిదని, అతని వాగ్ధాటికి ముగ్ధులైన విదేశీయులు బ్రహ్మానందం పట్టారని, భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు.కార్యక్రమంలో నవభారత్ యువజన సంఘం అద్యక్షుడు కరుణ్, అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ కోనేటి గోపాల్, ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ నాతి కృష్ణమూర్తి, శాంతి ట్రాక్ అసోసియేషన్ సెక్రెటరి పాండురంగం, యువజన సంఘల సభ్యులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.