రాయల్ పోస్ట్ ప్రతినిధి శంకర్ పల్లి రంగరెడ్డి జిల్లా : శంకర్ పల్లి మున్సిపల్

ప్రపంచం గర్వించదగ్గ మహనీయుడు స్వామీ వివేకానందున్ని స్ఫూర్తిగా తీసుకొని దేశానికి సేవ చేయాలని శంకర్ పల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్.నరేష్ కుమార్ (సతీశ్) పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్బంగా బుధవారం నాడు శంకర్ పల్లి సేవ ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నరేశ్ మాట్లాడుతూ దృఢ సంకల్పం ఆశయం ఉంటే విజయం సొంత అవుతుందని తెలిపారు. నేటి యువత మంచి అలవాట్లను నేర్చుకొని, ఈ కరోన కాలంలో జాగ్రత్తగా ఉండి కుటుంబాల ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శ్రీ జయరాం రెడ్డి, లిటిల్ స్టార్ పాఠశాల ప్రిన్సిపాల్ సంజీత్ కుమార్ సభ్యులు నర్సింహ గౌడ్, వెనేంద్ర చారి విద్యార్థులు, మింటూ, ఆర్య, నితిన్, మరియు సత్యనారాయణ పాల్గొన్నారు.