రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో కృషి ఐటిఐ, ఫ్రేషర్స్ డే స్వాగత వేడుకలు అంగరంగ వైభవంగా స్థానిక వై.యస్.ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృషి ఐటిఐ ఛైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్, కృషి ఐటిఐ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థకు సంబంధించిన ట్రైనింగ్ ఆఫీసర్ మైత్రి సుజయ్ కుమార్, కృషి ఐటిఐ ప్రిన్సిపల్ నమోజు రమేష్ ఆధ్వర్యంలో కృషి ఐటిఐ ఫ్రేషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా
స్వర్గీయ శ్రీ దరిపల్లి అనంత రాములు గారి చిత్ర పటానికి పూలమాలలు వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కృషి ఐటిఐ ఛైర్మెన్ దరిపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. గతకొంత కాలంగా ఎనలేని సేవలు అందించిన మా కృషి ఐటిఐ విద్య సంస్థ ద్వారా విద్యార్థులకు కొన్ని సంవత్సరాలుగా విద్యా బుద్ధులను నేర్పించి ఉన్నత స్థానాలకు పంపిన ఘనత మాయొక్క విద్యా సంస్థ మా దగ్గర చదివిన విద్యార్థులు ఇప్పుడు గోప్ప గోప్ప ఉద్యోగాలు చేస్తున్నారని చేపట్టడానికి గర్వంగా ఉందని వారు అన్నారు. ఈ ప్రేషర్స్ డే సందర్భంగా విద్యార్థులు వారి ఆటపాటలతో అలరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దరిపల్లి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ
ఈరోజు దరిపల్లి అనంత రాములు సార్ భౌతికంగా మన దగ్గర లేకున్నా విద్యార్థులు అధ్యాపకుల భువనగిరి విద్యావంతులకు హృదయాంతరాల్లో ఉన్నారు. విద్యాసంస్థలు ఉన్నంతకాలం వారి యొక్క పేరు ప్రఖ్యాతలతో చిరంజీవిగా ఉంటారు. తను సమయపాలన పాటిస్తూ అందరికి మార్గదర్శిగా నిలిచి, భువనగిరి, ఖమ్మం, ఇల్లందు ప్రాంతాలలో విద్యాపరంగా దశ దిశ కర్త అయి విద్యాపరంగా వేసిన భీజమే కృషి ఐటిఐ. విద్యార్థులు అన్ని రంగాల ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రభుత్వ ఐటిఐ ట్రైనింగ్ ఆఫీసర్ సుజిత్ మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాల్లో కృషి పారిశ్రామిక శిక్షణా సంస్థతో పాటు ఉపాధ్యాయ శిక్షణా సంస్థను మొదటగా నెలకొల్పిన ఘనత ఈ భువనగిరి పట్టణంలో కేవలం దరిపల్లి అనంత రాములు సార్ కి మాత్రమే దక్కిందనీ అన్నారు. ప్రిన్సిపల్ నమోజు రమేష్ మాట్లాడుతూ పారిశ్రామిక శిక్షణనే కాకుండా అన్ని రంగాలలో కావలసిన వనరులను తీర్చిదిద్దిన ఘనత, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సంస్థలను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పేద విద్యార్థులను ఉన్నత స్థితిలో ఉద్యోగ ఉపాధి రంగాలలో అందించిన విద్య ఈనాడు వారు తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం జరిగిందని అన్నారు. అనంతరం విద్యార్థులు ఆట పాటలతో విశేషంగా వినూత్న వేశదారనతో అలరించారు.
ఈ కార్యక్రమానికి కృషి ఐటిఐ ఛైర్మెన్ దరిపల్లి నవీన్ కుమార్, కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ ఐటిఐ ట్రైనింగ్ ఆఫీసర్ సుజిత్, గురవయ్య, పరమేష్, రాజు మరియు ప్రిన్సిపల్ నామోజు రమేష్ అధ్యాపకులు దుగ్యాల పాండురంగం, రాజు, నాగమల్లేశ్, శ్యామ్ కుమార్, భార్గవి, అనూష, లావణ్య, కిషోర్, అభిషేక్, యాకూబ్ , ఇస్తారి, శ్రావణ్ రెడ్డి, శేఖర్, స్రవంతి, క్రాంతి, శివ, శ్రీనివాస్, ప్రసన్న, సరిత, నరేందర్ రెడ్డి ,రాము కృషి ఐటిఐ విద్యార్థినీ విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.