రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో అడ్మినీస్ట్రేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహించిన R. హరి ప్రసాదరావు ఇటీవలనే 317 జీవో ప్రకారం బదిలీ ఐ హైదరాబాద్ కు వెళుతున్న సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం జరుపు కోవడం జరిగింది. ఈ సందర్భంగా వై సురేందర్ రెడ్డి DTO యాదాద్రి భువనగిరి వారు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. గత ఐదు సంవత్సరాలు కాలపరిమితి పూర్తి చేసుకొని అందరి మన్నలను పొందింది తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఘనంగా సన్మానించారు. రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.