రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ కలెక్టరేట్ భువనగిరి / 2022 సవంత్సరమునకు TNGOS, TGOS, రెవెన్యూ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ డైరీలు, క్యాలండర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నాడు కలెక్టరెట్ ప్రాంగణంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉద్యోగులను ఉదేశించి మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా అధికారి నుండి క్రింది స్థాయి ఉద్యోగి వరకు కలసి కట్టుగా ఉండి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని, అది ఒక మంచి సాంప్రదాయమని, ఉద్యోగులకు ఏ కష్టం వచ్చిన అండదండగా ఉంటానని, మనమందరం కలిసి జిల్లాను అభివృద్ధిలో పథంలో తీసుక వెళ్ళాలని కోరారు.కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారులు భూపాల్ రెడ్డి, సూరజ్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, జిల్లా ఉద్యోగుల జె ఏ సి చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, TNGOs జిల్లా అధ్యక్షులు జగన్, కార్యదర్శి ఖదీర్, TGOs కార్యదర్శి నాగిరెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భగత్, హాస్టల్ వెల్ఫేర్ అససియేషన్ ఇమానియెల్ శైలజ, రాజేష్ ఇంద్రిస్. జానయ్య , ఎమ్ పి డి ఓ,సంఘ నాయకులు బాలచందర్, నరేందర్ రెడ్డి, MPO జనార్ధన్ రెడ్డి, సంజీవరెడ్డి, జిల్లా అధికారులు, ఉద్యోగులు, పాల్గొన్నారు.