రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /(భువనగిరి టౌన్)దినపత్రిక 2022 సంవత్సరం క్యాలెండర్ ను మాజీ పి సి సి కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్లానింగ్ బోర్డ్ మెంబెర్ మరియు కౌన్సిలర్ పచ్చల హేమలత జగన్, 30వార్దు కౌన్సిలర్ ఎండి అజీముద్దిన్ చేతుల మీదుగా భువనగిరి పట్టణంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ కొత్త ఆలోచనలు ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చుకుని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని జీవితంలో ఉన్నత ఆశయాలను నెరవేర్చుకోవాలని కోరారు.ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ అలుపెరుగని పోరాటంతో వార్తలు సేకరిస్తూ ప్రజా సమస్యలను వెలికి తీస్తూ పత్రికను ముందుకు నడుపుతున్న రాయల్ పోస్ట్ దినపత్రిక సంపాదకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాయల్ పోస్ట్ పేపర్ సంపాదకులు ఎండి. ఫసిఉద్దీన్, స్టాఫ్ రిపోర్టర్ నల్ల.వేణు(మరోకిరణాలు)జి.వెంకన్న , , కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్తు, సిరిల్ బాబు, తదితరులు పాల్గొన్నారు.