రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: చిన్నారి అభిజ్ఞ పై జరిపిన శారీరక హింస సంఘటనకు బాద్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. AIPA చిన్నారి అభిజ్ఞ (5) ను శారీరకంగా హింసించి, పెదవి పై,చెంపమీద, చేతిమీద వాతలు పెట్టిన అంగన్వాడి కార్యకర్త పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా రెవెన్యూ అధికారి విజయ కుమారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం-2020 ప్రకారం ప్రాధమిక విద్య ను అంగన్వాడి కేంద్రం లో విలీనం ‌ చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరమన్నారు. ఈనెల 5 న పెద్ద కందుకూర్ గ్రామానికి చెందిన గుర్రం అనూష తన కుమార్తె అయిన అభిజ్ఞ ను ఉదయం 9 గంటలకు గ్రామం లోని అంగన్వాడీ కేంద్రం-1 లోకి పంపించి వెళ్ళింది. సాయంత్రం నాలుగు గంటలకు పాప ఏడుస్తూ కాలిన గాయాలతో ఇంటికి రావడంతో అంగన్వాడి కార్యకర్త సునీత ను వివరణ అడుగగా పాప ఏడుస్తున్న కారణంగా గంటె తో కాల్చి నట్టు,అభిజ్ఞ తల్లి అనూష చెబుతుందని ,దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. అభిజ్ఞ కు రక్షణ కలిపించాల్సిన, టీచర్, ఇలాంటి దారుణానికి పాల్పడడం విచాకరమని ఆయన అన్నారు. అంగన్వాడీ కార్యకర్త పై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్నారి అభిజ్ఞ కు రక్షణ కలిపించాలని, తల్లిధండ్రులకు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా,జిల్లా బాలల పరిరక్షణ అధికారి, జిల్లా శిశు సంరక్షణ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో చిన్నారి అభిజ్ఞ, తలిదండ్రులు గుర్రం అనూష,సుదర్శన్, నాయకులు దుబ్బాస్ కుమార స్వామి, సురుపంగ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు..