రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు వారోత్సవాలు చెయ్యడం కాదు.రైతులకు ముందుగా లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి.బ్యాంకులన్నీ వడ్డీ కిందికే రైతుబంధు డబ్బులను జమ చేసు కుంటున్నాయి.
కెసిఆర్ ప్రభుత్వం ముందు ఆ పేద రైతులకు సమస్యను పరిష్కరించాలి.రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే వర్తింపచేసి అప్పుల బాధ నుండి కాపాడాలి.అప్పుడు వరి వేయమని చెప్పి ఇప్పుడు వరి వేస్తే ఉరి అంటున్నావు.దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు.కొందరు రైతులు ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి కొనుగోలు కేంద్రాలలో ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి.యాసంగి వరి పంటకు సంబంధించి కొనుగోలు చేస్తామని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలి.
కరోనా,ఓమిక్రాన్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను రైతుబంధు సంబరాలలో పాల్గొనాలని చెప్పడం సరైన విధానం కాదు.రైతుబంధు డబ్బులను బ్యాంకుల్లో వేసినప్పటికీ అట్టి డబ్బులను అప్పుల కిందికే జమ చేసుకుంటున్నాయి. ఈ సీజన్‌లో పంటల సాగుకు సంబంధించి పెట్టుబడికి డబ్బులు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగా రైతులు సంతోషంగా లేరు.యాసంగి సాగుకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేస్తామని రైతాంగానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి.లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేసి రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించాలి.రైతులు అప్పుల బాధతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. *కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యుడు*.