రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ భువనగిరి/దినపత్రిక 2022 సంవత్సరం గోడ క్యాలెండర్ ను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ స్థానిక కౌన్సిలర్ పొత్నక్ ప్రమోద్ కుమార్ చేతుల మీదుగా భువనగిరి పట్టణంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ కొత్త ఆలోచనలు ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చుకుని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు.ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ అలుపెరుగని పోరాటంతో వార్తలు సేకరిస్తూ ప్రజా సమస్యలను వెలికి తీస్తూ పత్రికను ముందుకు నడుపుతున్న రాయల్ పోస్ట్ దినపత్రిక సంపాదకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఇరపక.నరసింహ, రాయల్ పోస్ట్ పేపర్ సంపాదకులు ఎండి. ఫసిఉద్దీన్, స్టాఫ్ రిపోర్టర్ నల్ల.వేణు,టౌన్ రిపోర్టర్ రమేశ్, (మరో కిరణాలు )జి.వెంకన్న , రిపోర్టర్ నాగరాజు,రిపోర్టర్ లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.