రాయల్ పోస్ట్ ప్రతినిధి (భువనగిరి)
భువనగిరి పట్టణ పెద్ద చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి కి 6 కోట్లు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి గారు 2017లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఇప్పటివరకు కూడా పనులు పూర్తి చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ ఆరోపించారు. కట్ట నిర్మాణానికి నిర్లక్ష్యం నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి పెద్ద చెరువు కట్ట పైన పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా నిర్మాణం చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన పట్టణంగా తీర్చిదిద్దడంలో భాగంగా భువనగిరి పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా నిర్మాణం చేస్తానని 2017 లో శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తానని హామీ నేటి వరకు కూడా నీటి మూట లాగానే మిగిలిపోయాయి అని ఆరోపించారు. 6 కోట్ల రూపాయలు నిధులు పూర్తిగా అవినీతిమయమైనవి కనీసం 1 కోటి రూపాయల పనులు కూడా చేసిన తాలూకా లేదని అన్నారు. ఇంత పెద్ద పట్టణానికి పురాతనమైనటువంటి కట్ట చెరువును గ్రీనరీ గార్డెన్,సెంటర్ లైటింగ్, సిసి రోడ్లు, బోటింగ్, బార్ గేట్లు, వయోవృద్ధుల కూర్చునే విధంగా సిట్టింగ్ చైర్స్ డ్రిల్లింగ్, చిన్న పిల్లలకు ఆడుకునే ఆటవస్తువులను ఏర్పాటు చేస్తానని భువనగిరి పట్టణ వయోవృద్ధులకు విశ్రాంత ఉద్యోగస్తులకు మహిళలకు ఉదయం సాయంత్రం సమయంలో వాకింగ్ చేసుకునేవిధంగా వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. మాయమాటలు చెప్పి రెండోసారి ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇప్పటివరకు పెద్ద చెరువు కట్ట ను మినీ ట్యాంక్ బండ్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉన్నదని అన్నారు ఎమ్మెల్యే ఆరు కోట్ల రూపాయల ఖర్చు పెట్టేది ఎంత? 6 కోట్ల రూపాయలు పూర్తిగా ఖర్చు కాకముందే ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు సొంత నిధులతోనే అభివృద్ధి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటివరకు ఎన్ని నిధులు మిగిలి ఉన్నాయని చెప్పాలని జిల్లా కలెక్టర్ గారు ఇరిగేషన్ ఉన్నత అధికారులు బహిరంగంగా ప్రకటించాలని భువనగిరి పట్టణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత ఎమ్మెల్యే సొంత నిధులు ఖర్చు పెట్టాలి గాని ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిక ముందే తన సొంత నిధులతోనే భువనగిరి పెద్ద చెరువు పై గ్రీనరీ ఏర్పాటు చేస్తారని చెప్పడం పట్టణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా భువనగిరి పెద్ద చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ ఎన్ని రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తెస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని 6 కోట్ల రూపాయల పైన కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు పడిగెల రేణుక ప్రదీప్ ఈరపాక నరసింహ కైరంకొండ వెంకటేష్ నజీమా సలావుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్ ఖాన్ శ్యామల సురేష్ కూర ఉపేందర్ రాజేశ్వర్ మల్లేష్ భాస్కర్ విజయ్ సిద్దు మాధవ రెడ్డి వాకర్స్ లక్ష్మయ్య వెంకటయ్య శ్రీనివాస్ నరేష్ సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.