రాయల్ పోస్ట్ ప్రతినిధి

రామగుండం కమీషనర్ అఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి. ఆదేశాల మేరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్తూరి తిరుపతి అనే వ్యక్తి , నిజామాబాద్ నుండి మంచిర్యాలలోని తన ఇంటికి రహస్యంగా నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేసుకుంటున్నాడనే ముందస్తు సమాచారంతో ఈరోజు ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐబీ చౌరస్తా వద్ద మాటువేసి ఉండగా TS 08 UD 3049 నెంబరు గల టాటా సూపర్ ఏస్ వాహనంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను తరలిస్తూ ఉండగా తనిఖీ చేసి పట్టుకోవడం జరిగిందని టాస్క్ ఫోర్స్ సీఐ మహేందర్, ఎస్ఐ లచ్చన్నలు తెలిపారు. ఈ క్రమంలో డ్రైవర్ ఎస్కే మహమూద్ ను అదుపులోకి తీసుకొని అతను ఇచ్చిన సమాచారం మేరకు ఉత్తూరి తిరుపతి ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, పట్టుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 3,00,000/- రూపాయలుగా ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్బంగా టాస్క్ ఫోర్స్ సిఐ మహేందర్ మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి వరుస తనిఖీలు నిర్వహిస్తామని, ఇక్కడ గుట్కా వ్యాపారం నిర్వహించే వారిపై, బయట ప్రాంతాల నుండి ఇక్కడికి తరలిస్తున్న వారిపై చట్టరీత్యా తగు కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ వ్యాపారాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారి సమాచారం సేకరించి వారి అక్రమ దందాలపై వరుస దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.పట్టుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను, వాహనాన్ని మరియు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం
మంచిర్యాల పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది. ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ సీ.ఐ,
యస్.ఐ లతో పాటు సిబ్బంది సంపత్ కుమార్,
రాకేష్, భాస్కర్ గౌడ్,
శ్రీనివాస్,శ్యామ్ సుందర్ లు పాల్గొన్నారు.