రాయల్ పోస్ట్ ప్రతినిధి
బెల్లంపల్లి

రామగుండం కమీషనర్ అఫ్ పోలీస్ చంద్ర శేఖర్ రెడ్డి ఐపిఎస్ ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ సీఐ. ఏకే.మహేందర్ మరియు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు వారి సిబ్బంది బెల్లంపల్లి 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహబూబ్ అలి,ఆహ్మద్ అనే వ్యక్తులు , బెల్లంపల్లి నుండి హైదరాబాద్ కి రహస్యంగా నిషేధిత కాపర్ వైర్ ని అక్రమ రవాణా చేస్తున్నాడనే ముందస్తు సమాచారంతో , నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓవర్ బ్రిడ్జి వద్ద మాటు వేసి ఉండగా , TS 12 UC7844 నెంబరు గల ఐచేర్ వాహనంలో ఇనుము తుక్కు మధ్యలో కాపర్ వైర్ తరలిస్తూ ఉండగా తనిఖీ చేసి పట్టుకోవడం జరిగింది.పట్టుకున్న కాపర్ వైర్ విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 50,000/- రూపాయలుగా ఉంటుంది.పట్టుకున్న కాపర్ వైర్, వాహనాన్ని మరియు నిందితులని తదుపరి విచారణ నిమిత్తo బెల్లంపల్లి 2 వ పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది. ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ సీఐ ఎకె.మహేందర్,యస్.ఐ. లచ్చన్న ,మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్,శ్యామ్ సుందర్ లు పాల్గొన్నారు.