రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణం లోని తాతా నగర్ మరియు వడాయిగూడెం లో ఉన్న ప్రెసిడెన్సీ స్కూల్స్ లో శుక్రవారం 15-16 సంవత్సరాల విద్యార్థులకు కోవిడ్ వాక్సినేషన్ ఇవ్వడం జరిగింది.తల్లిదండ్రుల మరియు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు ప్రెసిడెన్సీ స్కూల్ 9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు కోవిడ్ వాక్సినేషన్ ఇవ్వడం జరిగింది .పాఠశాల చైర్ పర్సన్ తీగల జయలక్ష్మి స్వయంగా దగ్గర ఉండి విద్యార్థులకు ధైర్యం చెప్తూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్బంగా వాక్సినేషన్ ఇవ్వడానికి వచ్చిన ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేసారు .ఈ కార్యక్రమంలో అడ్మిన్ డైరెక్టర్ మహిపాల్ రెడ్డి మరియు స్టాఫ్ నవీన్ , శ్రీదేవి , సరిత , సుష్మ తదితరులు పాల్గొన్నారు .