రాయల్ పోస్ట్ ప్రతినిధి యాదగిరిగుట్ట, భువనగిరి ::

ఉపాధ్యాయుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త నియామకాలు చేయకపోగా ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా జిల్లాలను విభజించి ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు పంపిస్తూ వారి కుటుంబాలలో నిప్పులు పోస్తున్నారని చెప్పారు. భార్యాభర్తలు ఒకే దగ్గర పని చేయాలనే నిబంధనలు తుంగలోకి తొక్కార ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, జిల్లా నాయకులు గుండు నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.