రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ భువనగిరి టౌన్ / భువనగిరి పట్టణంలో స్థానిక శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల. భువనగిరి ఆవరణలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్దులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య భద్రత ప్రాణ భద్రత కాబట్టి అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మహేందర్, అభిషేక్ ,రాము యాకూబ్ బాబా ,ఇస్తారి ,వీరయ్య, నరేందర్ రెడ్డి ,శేఖర్ ,మోయిన్ తదితరులు పాల్గొన్నారు.