రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ మరియు న్యాయ శాఖామాత్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరడం జరిగింది. అనంతరం నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే కాసేపు మంత్రితో చర్చించారు.