ప్రపంచానికే మార్గదర్శి బాబాసాహెబ్ అంబేద్కర్ DSDO జైపాల్ రెడ్డి..

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / భువనగిరి ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్, భారతరత్న అంబేద్కర్ ప్రపంచానికే మార్గదర్శి అని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి జైపాల్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ అన్నారు.యాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కాలేజీ గర్ల్స్ హాస్టల్ లో జరిగిన కార్యక్రమంలో వంద మంది విద్యార్థినిలకు అంబేద్కర్ జీవిత విశేషాలతో ముద్రించిన పుస్తకాలను అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలమంత సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాటం చేశారని, అంతే కాకుండా ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారని అన్నారు.ప్రతీఒక్కరు మహనీయుల చరిత్రలను చదివి తెలుసుకోవాలని అందుకు మరిన్ని పుస్తకాలను విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఈకార్యక్రమానికి యాత్ర సంస్థ డైరెక్టర్ సురుపంగ శివలింగం అధ్యక్షత వహించగా ASWO శైలజ, వార్డెన్ చంద్రకళ పాల్గొని ప్రసంగించారు.