రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / కొత్తగూడెం లో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబ ఆత్మహత్య కు కారకుడైన కొత్తగూడెం టీఆరెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ మొహ్మద్ అతహర్ డిమాండ్ చేశారు.శుక్రవారం అతహర్ విలేకరులతో మాట్లాడుతూ కొత్తగూడెం లో తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని రాఘవ వికృత చేష్టలు, అమాయక ప్రజలను వేదింపులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవ వేధింపులు తాళలేక ఇప్పటికే ఎన్నో కుటుంబాలు బలి కావడమేకాక మరిన్ని కుటుంబాలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఆత్మహత్య కు ముందు రామకృష్ణ విడుదల చేసిన సెల్ఫీ వీడియో చూసిన మానవత్వం ఉన్న వారందరూ కంటతడిపెట్టారు. ఈ సెల్ఫీ వీడియోను ఆధారంగా చేసుకుని వనమా రాఘవ పై హత్య కేసు,ఫోక్స్ కేసు నమోదు చేసి శిక్షించాలని కోరారు.రాఘవ పై గతంలో అనేక కీచక ఆరోపణలు ఉన్నాయని ముందే అతనిపై చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఒక నిండు కుటుంబం ఇలా ఆత్మహత్య చేసుకుని ఉండేది కాదు అని అన్నారు.ఇకనైనా ఒక నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పూర్తి భాద్యత వహిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేసి కొడుకును స్వయంగా పోలీసులు లకు అప్పచెప్పాలని కోరారు.లేని యెడల వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఆదేశానుసారం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.