.

రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం లోని కిష్టంపేట ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని గత నెల తహసీల్దార్ కి ఫిర్యాదు చేయగా అందులో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారని, వారు ఏర్పాటు చేసిన బోర్డులు కొన్ని నిమిషాల వ్యవధిలో భూ కబ్జాదారులు తొలగించడం జరిగిందని యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి మోమిన్ అలీ,బియ్యాల నరేందర్ లు తెలిపారు.ఇట్టి విషయం RI కి తెలియజేసామని, బోర్డులు తొలగించిన కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాండూర్ తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. అట్టి భూమి హద్దులు నిర్ణయించి ప్రభుత్వ కళాశాల లేదా మహాత్మా గాంధీ బాపు గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని వారు కోరారు.