రాయల్ పోస్ట్ ప్రతినిధి
బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో కార్మికుల సమస్యలు తీర్చాలని కోరుతూ ఏఐటీయూసీ శాంతిఖని గని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో గని మేనేజర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య దాగం మల్లేష్ లు మాట్లాడుతూ గనిలో పని చేస్తున్నటువంటి కార్మికులకు బెల్లంపల్లి లో నే క్వార్టర్ కేటాయించాలని, ఇల్లీగల్ గా క్వార్టర్ లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరారు. సర్ఫేస్ జనరల్ మజ్దూర్ ప్రమోషన్లలో ఖాళీలను దరఖాస్తు చేసుకున్న వారితో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు డ్రింకింగ్ వాటర్, నైపుణ్యత కలిగిన క్యాంటీన్ కుక్ ను నియమించాలని కోరారు. కార్మికులకు సీఎం పిఎఫ్ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.