రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / భువనగిరి పట్టణ ప్రధాన రహదారి ఇరువైపులా రోడ్డు వెడల్పు విస్తీర్ణంలో నష్టపోతున్న బాధితుల కోసం కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్న తరుణంలో అకస్మాత్తుగా మురికి కాల్వ పరిశీలనకు వచ్చినా స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ని అడ్డుకొని నష్టపోతున్న బాధితుల కోసం ప్రశ్నల వర్షం కురిపించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం 24-9-2021 రోడ్డు వెడల్పు విస్తీర్ణం పనులను ప్రారంభించి మూడు నెలల లోపు రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పిన మాట ఏమైంది ఎమ్మెల్యే రాత్రి రాత్రికే జిల్లా కలెక్టర్ కలిసి మున్సిపల్ అధికారులు పెట్టి 348 స్ట్రక్చర్స్ కూలగొట్టి వాళ్లను రోడ్డుపాలు చేసి వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం నేటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు సమంజసమేనా ఇంకా ఎప్పుడు ఇస్తారు దాని మీద స్పష్టమైన హామీ ఇవ్వగలరా 200మందికి సంబంధించిన డబ్బా కార్మికులను,తోపుడుబండ్ల కార్మికులను,మడిగెల యజమానులను వాళ్లకు సంబంధించిన డబ్బాలను తొలగించి వాళ్ల ఉపాధి కోలీపోయేటట్లుగా చేసి వాళ్లను పస్తులుగా ఉండేటట్లుగా మీరు చేసి వాళ్ల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇంతవరకు చేయకుండా భువనగిరి ఆదర్శ పట్టణం అని మీరు ప్రకటించడం ఎంతవరకు సమంజసం
రోడ్డు వెడల్పు విస్తరణ 4.5 కిలోమీటర్ల చేపడతాం చెప్పి బొమ్మయిపల్లి క్రాస్ రోడ్ నుండి ఎస్ ఎల్ ఎన్ డిగ్రీ కళాశాల వరకు నిర్మాణం చేపడుతున్నారు కానీ ఇప్పుడు 2.7 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు విస్తరణ శివాలయం కమాన్ రోడ్ నుండి సాయిబాబా గుడి వరకు చేపట్టడంలో రోడ్డు విస్తీర్ణ ఎంత వరకు జరిగింది ఇది సమంజసమో, 50 ఫీట్ల రోడ్డు వెడల్పు విస్తీర్ణం చేస్తానని చెప్పి 50 ఫీట్లు తర్వాత మురికి కాల్వ నిర్మాణం చేస్తానని చెప్పి ఇప్పుడు 38 పీట్ల మీదనే మురికి కాల్వ నిర్మాణం చేయడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి రోడ్డు వెడల్పు విస్తీర్ణ చేస్తే భవిష్యత్ 40 నుండి 50 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా నిర్మాణం చేయాలి కానీ మీరు ఈనాడు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు నాలుగు సంవత్సరాలు కూడా ఉపయోగపడే లేని విధంగా చేయడం ఎంత వరకు సమంజసం ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు విస్తీర్ణంలో విద్యుత్ వైర్ల కోసం విద్యుత్ టవర్లు ఏర్పాటు చేయకుండా కేవలం సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో భవిష్యత్ తరాలకు విద్యుత్ వైర్లు వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిసికూడా మీరు ఎందుకు విద్యుత్ టవర్లను ఏర్పాటు చేయడం లేదు రోడ్డు వెడల్పు విస్తీర్ణం చేపట్టడం వల్ల ప్రధాన రహదారి మీద ఉన్న డబ్బా కార్మికులను, తోపుడు బండ్ల కార్మికులను మాడిగెల యజమాన్యాలు ఇండ్ల యాజమాన్యాలకు దసరా దీపావళి పండుగలు చేసుకోకుండా చేసినావు ఇప్పుడు వాళ్లను సంక్రాంతి పండుగ కూడా చేసుకోకుండా అంధకారంలో ఉంచావు సమంజసమా ఇదిగాక అంబేద్కర్ చౌరస్తా నుండి నల్గొండ చౌరస్తా రోడ్డు కూడా 80 పీట్లతో రోడ్డు వెడల్పు చేస్తానని నల్గొండ రోడ్డుకు ఉన్న ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమా అని ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది ఎమ్మెల్యే ఎలాంటి సమాధానం చెప్పకుండా పోలీసుల పేట్టుకొని వెళ్లిపోవడం జరిగింది ఈకార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఈరపాక నరసింహ నజీమా సలావుద్దీన్ కైరంకొండ వెంకటేష్ వడిచర్ల లక్ష్మీ కృష్ణ యాదవ్ కోల్ల దుర్గ భవాని గంగాధర్ కాంగ్రెస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ మాజర్ పాషా బబ్లు భువనగిరి వెంకటరమణ కసరబోయిన సాయి కాకునూరి మహేందర్ మనోజ్ ఉపేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది