రాయల్ పోస్ట్ హైద్రాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షతన, ధరణి పోర్టల్ వల్ల భూమి నష్ట పోయిన వారి జాబితా సేకరించి వారి తరపున న్యాయపోరాటానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, ప్లానింగ్ కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ, మాజీ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం అధ్యక్షులు నాగరిగారి ప్రీతం మరియు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి సంకేత పాల్గొన్నారు.