రాయల్ పోస్ట్ ప్రతినిధి
బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని ఆల్బర్ట్ ఐటీఐ కళాశాలలో 15-18 సంవత్సరాల వయస్సు గల యువతీ&యువకులకు జరుగుతున్న కరోనా వాక్సినేషన్ ప్రక్రియను మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ పరిశీలించారు.ఈ సందర్బంగా ఆవిడ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని విద్యాసంస్థలలోని అర్హులైన యువతి యువకులందరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు