రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: రాబోయే రోజులలో కోవిడ్ ఉద్రిత స్థాయి కి చేరే అవకాశం ఉన్నందున బిబినగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ను వెంటనే కోవిడ్ హాస్పిటల్ గా మార్చి అన్ని విధాలా పూర్తి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని కలసి వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ మొహమ్మద్ అతహర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అనంతరం మొహమ్మద్ అతహర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఒక డాక్టర్ గా ప్రజలకు వైద్యాన్ని చేరువచెయ్యాలని ఒక మంచి ఆలోచనతో బిబినగర్ లో నిమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వారు ప్రారంభించిన నిమ్స్ హాస్పిటల్ ను తర్వాతి ప్రభుత్వాలు కేవలం ఎయిమ్స్ హాస్పిటల్ గా పేరు మాత్రమే మార్పుచేసి సదుపాయలను పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేసి ఇప్పటి వరకు దానిలో పూర్తి వైద్య సేవలు మొదలుపెట్టడంలో విఫలమయ్యాయి. చాలా విషాలవంతమైన ప్రదేశంలో నిర్మించబడిన ఎయిమ్స్ హాస్పిటల్ ను ఇప్పటివరకే ప్రారంబించిఉంటే ఉమ్మడి నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాలకు చాలా సౌకర్యవంతం గా ఉండేది కానీ దానిని తుంగలోకి తొక్కి బిజేపీ, టీఆరెస్ ప్రభుత్వాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజలను వైద్యానికి దూరం చేస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఎంతో మంది ప్రజలు హైదరాబాద్ లోని ప్రయివేటు హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకక చాలా ఇబ్బందులకు గురి ఐనారు బెడ్స్ దొరికిన వారు కూడా అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని కొన్ని లక్షల రూపాయలు నష్టపోయారు.డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని మంచి ఆలోచనతో ఆరోగ్యశ్రీ పేరు తో ఒక మంచి పథకాన్ని ప్రవేశపెడితే దాన్నీ నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటికే ఎన్నో వ్యాదుకులకు చికిత్సను ఆరోగ్రశ్రీ నుండి తొలగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలో ప్రయివేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో కుమ్మకై కొన్ని వందల కోట్ల ప్రజల సొమ్మును కాజేశారు.ఇప్పటికైనా వెంటనే కరోనా ను పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ లో చేర్చి అన్ని ప్రయివేట్ హాస్పిటల్స్ లలో ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి అని వైఎస్ షర్మిల చాలా రోజుల ముందే డిమాండ్ చేశారు ఐనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించింది .ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కరోనా పూర్తి వైద్య సేవలను ఆరోగ్యశ్రీ లో చేర్చి బీద ప్రజలకు మేలు చేయాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ అధ్యక్షుడు కరకాల రమేష్, మైనారిటీ నాయకులు షకీల్, వాహెద్,రకీబ్ యువజన నాయకులు సాయినివాస్ తదితరులు పాల్గొన్నారు..