రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ భువనగిరి/ భువనగిరి పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా మురికి కాలువ పనులు నత్తనడక నడుస్తున్నాయనీ పట్టణ ప్రజలు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆర్. అండ్. బి. ఆఫీస్ నుండి పాత బస్ స్టాండ్ వరకు మురికి కాలువ విస్తరణ పనులు చేపడుతున్నారు.పనులు ఒక్క సైడ్ మొదలు పెట్టారు.కానీ మొదలుపెట్టి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పూర్తి కలేదంటున్న వ్యాపారులు.ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదని వ్యాపారస్తులు ఆవేదన వెక్తం చేస్తున్నారు.2020-21లో కరోనా మహమ్మారితో వ్యాపారాలు నడవక ఎంతో ఇబ్బంది పడ్డామని.ఇప్పుడు ఈ మురికి కాలువ నిర్మాణం పనులు ఆలస్యం కావడంతో వ్యాపారాలు లేక ఇల్లు గడవడం మడిగే కిరాయిలు కట్టలేక పిల్లల బడి ఫీజులు కట్టలేని లో ఉన్నామన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ,అధికారులు చొరవ తీసుకొని పనులు వేగవంతం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యాపారులు.