హైదరబాద్ : రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో… 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ శ్రేణులు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుణి అరెస్టును ఖండిస్తూ… కార్యకర్తలు ఇవాళ నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. మరోవైపు నిర్బంధాలు, అరెస్టులతో ప్రజలతో సంబంధాన్ని తెంచలేదని… ప్రభుత్వంపై బండి సంజయ్‌ మండిపడ్డారు.