రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో పట్టణ బిజెపి అధ్యక్షుడు పాదారాజు ఉమా శంకర్ రావు ఆద్వర్యం లో బండి సంజయ్ అరెస్టు 14 రోజుల రిమాండ్ ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలి యజేశారు.
వారు మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టుబండి సంజయ్ అరెస్టు 14 రోజుల రిమాండ్ ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తున్నా మన్నారు.315 జీవోను సవరణ చేస్తే నీరు ద్యోగులకు ఊరట కలుగు తుందని ఆయన తెలంగాణ ప్రజల మేలు కోరి ఆయన దీక్ష చేస్తే కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని అంటున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నగరంలో ఓవైసీ వివిధ ప్రారంభోత్సవాలు చేసు కుంటూ వెళితే అది కోవిడ్ ఉల్లంఘన కాదా .
నల్లగొండ పట్టణంలో కేటీఆర్ బైక్ ర్యాలీ తీస్తే అప్పుడు కోవిడ్ నిబంధనలు గుర్తుకు రాలేదా.
ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే అధికారికంగా ప్రోగ్రాం చేస్తే కోవిడ్ నిబంధనలు వారికి వర్తించవా అని అన్నారు.జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్ అరెస్టు చేయడం అమానుషం అన్నారు.నిరసన తెలిపే ప్రతిపక్షం పైన పోలీసులతో లాఠీలు జరిపించడం సరికాదని హెచ్చరించారు.వెంటనే బండి సంజయ్ ని విడుదల చేసి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లానాయ కులు నర్ల నర్సింగ్ రావు,చందా మహేందర్ గుప్తా,బాల్రెడ్డి, డి. లక్ష్మీ నారాయణ,సుర్వి. శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ పట్నం కపిల్, ఉడుత భాస్కర్, కౌన్సిలర్లు జనగాం కవిత నరసింహాచారి, ఉదరి లక్ష్మీ సతీష్, రత్నాపురం. బలరాం పంచుదుల. బలరాం పట్టణనాయకులు పాల్గొన్నారు.