రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ భువనగిరి రూరల్ / ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జనవరి 4 వ తేదీ నుండి పదవ తేదీ వరకు రైతుబంధు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం నాడు గౌస్ నగర్ గ్రామంలో జరిగిన రైతుబంధు వారోత్సవాలలో ప్రజలు రైతులు, మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేళా సత్పతి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆరుతడి పంటలకు, డైరీ ఫామ్ లకు, కూరగాయలు మొదలైన పంటలు పండించాలని రైతులను కోరారు. వరి లో కూడా పోషకాలు ఎక్కువగా ఉన్న ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, బాస్మతి పండించు కోవచ్చని కోరారు. ప్రభుత్వం రైతుల ఆర్థిక స్వావలంబన కోసం రైతుబంధు ప్రవేశపెట్టి, రైతుకు వెన్నుదన్నుగా పెట్టుబడి సహాయం అందించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేసారు. రైతు బంధు పథకం వలన తమకు పంటల సాగులో ఆర్థిక ఇబ్బందులు తప్పాయని, ఎక్కువ పంటల సాగుకు భూమిని పెంచడానికి దోహద పడుతున్నదని రైతులు అభిప్రాయ పడ్డారు.కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జడ్పిటిసి బీరు మల్లయ్య, ఎంపిపి నిర్మల వెంకటస్వామి, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాసు.రమేశ్, సర్పంచ్ పుష్పమ్మ క్రిష్ణ, రైతుబంధు కోఆర్డినేటర్ మల్లయ్య, గౌస్ నగర్ క్లస్టర్ రైతు వేదిక ఎ ఈ వో శ్రీనివాస్, ఉప సర్పంచ్ పోసిరెడ్డి, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, తొక్కా పురం ఎంపిటిసి రాసాల మల్లేష్, వార్డ్ మెంబెర్స్ ఎల్లారెడ్డి, సిద్దులు స్వాతి, మౌనిక, నరేష్, అండా లు, పావని, గ్రామ రైతు కో ఆర్డినేటర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.