రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ఆత్మకూరు ఎం: మండల కేంద్రంలో మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ యాస ఇంద్రా రెడ్డి వ్యవసాయ క్షేత్రం పచ్చని జొన్న చేనులో ఆత్మకూరు గ్రామ టీఆర్ఎస్ తరపున రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్న రైతు బాంధవుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు ఆలేరు నియోజక వర్గ అభివృద్ధి ప్రధాత ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గార్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా దేశ రాష్ట్రాలు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రైతులకు పెట్టుబడికి ఇబ్బందులు పడకుండా సమయానికి రైతు బంధు పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయంను జమ చేస్తున్న గొప్ప మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని పదికాలాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ యాస కవిత ఇంద్రా రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ కోరే భిక్షపతి, బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ యాస ఇంద్రా రెడ్డి,గ్రామ టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు కోరే వెంకన్న,గ్రామ రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నాతి రాజు గౌడ్,బీసీ సెల్ జిల్లా నాయకులు ఎలిమినేటి ఎలేందర్, బీసీ సెల్ అధ్యక్షుడు తవిటి వెంకటేశ్వర్లు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ అజీమొద్దీన్,నాయకులు పాశం అనంత రెడ్డి,అశోక్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,రంగ సత్యనారాయణ,మజ్జిగ రాంబాబు,గట్టు అశోక్, కదిరే నవీన్,మహిళా నాయకులు పొన్నగాని జయశ్రీ, తవిటి లక్ష్మి, టిఆర్ఎస్ నాయకులు నాతి మల్లిఖార్జున్,రేగు మోహన్,యాస రాజు,గడ్డం సతీష్,తదితరులు పాల్గొన్నారు.